● సీపీఐఎంఎల్ మాస్‌లైన్
రాష్ట్ర కార్యదర్శి రంగారావు
సిరికొండ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని ప్రకటించి, అందరూ అలవాటు పడ్డాక యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం చార్జీలను వేయడం సిగ్గు చేటని సీపీఐఎంఎల్ మాస్‌లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. గడ్కోల్ గ్రామంలో జరుగుతున్న పార్టీ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతుల్లో మూడో రోజు గురువారం ఆయన ప్రసంగిస్తు ఆన్‌లైన్ లావాదేవీలపై విధిస్తున్న చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ రాజకీయ శిక్షణా తరగతుల్లో పాల్గొనడానికి వచ్చిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యను రావుట్ల, పందిమడుగు గ్రామస్తులు, ఎంఆర్‌పీఎస్ మండల నాయకులు వేర్వేరుగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సెక్రెటేరియట్ సభ్యులు కే రమ, కెచ్చల రంగయ్య, వీ ప్రభాకర్, రావుట్ల సర్పంచ్ రాజ్‌కుమార్, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, వీడీసీ చైర్మన్ ఇట్టంపేట రమేశ్, వీడీసీ సభ్యులు, పందిమడుగు వీడీసీ చైర్మన్ మోహన్, కార్యదర్శి ఆశిష్, కోశాధికారి ఈర్ల రవి, బాలునాయక్, ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సంజీవ్, సిరికొండ మాజీ సర్పంచ్ రవిశంకర్, గణేశ్, ప్రవీణ్, పెద్దరాజన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


