● ఎంపీ అర్వింద్ ధర్మపురి
సుభాష్‌నగర్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు పార్టీ జాతీయ నాయకత్వం సూచించిన మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నగరంలోని బీజేపీ కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితో కలిసి ప్రారంభించారు. 70 మందికిపైగా రక్తదానం చేయగా, యూనిట్లను రెడ్‌క్రాస్ సొసైటీకి అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడ ర్ ప్రమోద్‌కుమార్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీగౌడ్, కార్పొరేటర్లు, నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఓంసింగ్, వెల్మ గంగారెడ్డి, బొబ్బిలి వేణు తదితరులు పాల్గొన్నారు.


