మట్టి గణపతులను పూజించాలి | - | Sakshi
Sakshi News home page

మట్టి గణపతులను పూజించాలి

Sep 18 2026 2:27 AM | Updated on Sep 18 2026 2:27 AM

సీపీ సాయిచైతన్య

కమ్మర్‌పల్లి: పర్యావరణ పరిరక్షణకు మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను పూజించాలని సీపీ సాయి చైతన్య అన్నారు. గురువారం రాత్రి కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌లో మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీవోపీతో చేసిన విగ్రహాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని అన్నారు. యువత పీవోపీతో చేసిన విగ్రహాలను ప్రతిష్టించకూడదని సూచించారు. నవరాత్రోత్సవాల్లో డీజే సౌండ్‌ సిస్టం వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలన్నారు. ఆర్మూరు ఏసీపీ జే వెంకటేశ్వర్‌రెడ్డి, భీమ్‌గల్‌ సీఐ పొన్నం సత్యనారాయణ, ఎస్సై సీహెచ్‌ సతీశ్‌, సర్పంచ్‌ జమున, వీడీసీ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

వేల్పూర్‌: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయని సీపీ సాయి చైతన్య అన్నారు. వేల్పూర్‌ మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో రాష్ట్ర సీడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సుంకెట అన్వేష్‌రెడ్డి ఏర్పాటు చేయించిన 16 సీసీ కెమెరాలను గురువారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఒక్క సీసీ కెమెరా వంద పోలీసులతో సమానమన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్మూర్‌ రూరల్‌ సీఐ జాన్‌రెడ్డి, వేల్పూర్‌ ఎస్సై సంజీవ్‌, సర్పంచ్‌ కొల్లె నర్సయ్య, ఉపసర్పంచ్‌ రఘుపతి, సొసైటీ మాజీ చైర్మన్‌ లింబారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement