కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): ప్రభుత్వం ఉపాధ్యాయులకు 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీ దాస్ డిమాండ్ చేశారు. గురువారం భీమ్‌గల్ మండలంలోని జాగిర్యాల్, కుప్కల్, బెజ్జోరా, ముచ్కూర్, పిప్రి, బాచన్‌పల్లి, కేజీబీవీ పాఠశాలల్లో నిర్వహించిన డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈహెచ్‌ఎస్ అమలులో ఉపాధ్యాయులు, ఉద్యోగులను ప్రభుత్వం గందరగోళానికి గురిచేస్తోందని సమస్యను వెంటనే పరిష్కరించి పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు ఎం బాలయ్య, కార్యదర్శి షేక్ మదర్, గట్టు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి: మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో పాము కలకలం సృష్టించింది. డైనింగ్ హాల్‌లో పాము కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ప్రతిరోజు మాదిరిగానే డైనింగ్‌హాల్‌లో విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఓ విద్యార్థిని అన్నం తినే ప్లేట్ తీస్తుండగా పాము కనిపించింది. సిబ్బంది పామును చంపివేశారు. అనంతరం విద్యార్థినికి వైద్యపరీక్షలు చేయగా పాము కాటువేయలేదని వైద్యులు నిర్ధారించారు. హాస్టల్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేదని, సిబ్బంది నిర్లక్షం వల్లే పాములు తిరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.


