యూపీఐ మంట | - | Sakshi
Sakshi News home page

యూపీఐ మంట

Sep 17 2026 2:14 AM | Updated on Sep 17 2026 2:14 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌
వ్యాపారులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ చార్జీలు

జిల్లాలోని వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆందోళన

అక్టోబర్‌ 15 నుంచి అమలులోకి నిబంధనలు

మళ్లీ నగదు లావాదేవీలు పెరిగే అవకాశం

జిల్లాలో ఏటా రూ.3.50

కోట్లకు పైగా డిజిటల్‌ చెల్లింపులు

సాయుధ పోరాటాల..

సిరికొండ మండలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఛాయలు నేటికీ కదలాడుతున్నాయి.

గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

– 8లో u

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) విధానంలో కొనసాగుతున్న డిజిటల్‌ చెల్లింపులు ఇన్నేళ్లుగా ఉచితంగా కొనసాగుతుండగా, ఇకనుంచి చార్జీలు విధించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అక్టోబర్‌ 15 నుంచి యూపీఐ చెల్లింపులకు చార్జీలు అమలు కానున్నాయి. జిల్లాలోని వ్యాపార, వాణిజ్య రంగాల్లో నగదు లావాదేవీల కన్నా డిజిటల్‌ పద్ధతిలోనే ఎక్కువగా చెల్లింపులు కొనసాగుతున్నాయి. యూపీఐ చెల్లింపులపై చార్జీల భారంతో ప్రధానంగా వ్యాపారులు, పెట్రోల్‌ బంకులు, పాఠశాలల నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది.

వ్యాపార లావాదేవీలపై..

జిల్లాలో కూరగాయల నుంచి దుకాణాల్లో నిత్యవసరాల కొనుగోళ్లు, వాణిజ్య దుకాణాల్లో చెల్లింపుల వరకు సింహభాగం యూపీఐ చెల్లింపుల్లో కొనసాగుతున్నాయి. ప్రతి చోటా ఫోన్‌పే, గూగుల్‌పే వినియోగం పెరిగింది. ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలకు ఉచితంగానే సేవలందించగా ఇప్పుడు వ్యక్తిగత చెల్లింపులకు కాకుండా వ్యాపారులకు మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ విధించనున్నారు. రూ.2 వేలకు పైగా చేసే చెల్లింపులపై 0.4 శాతం చార్జీ విధించనుండగా, రూ.75 వేలు దాటే చెల్లింపులకు ఒక్కో లావాదేవీకి రూ.300 వరకు చార్జీలు వసూలు చేయనున్నారు. జిల్లాలో ఏటా సుమారు రూ. 3.50 కోట్ల వరకు యూపీఐ విధానంలో చెల్లింపులు జరుగుతున్నట్టు అంచనా. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వ్యక్తుల మధ్య జరిపే చెల్లింపులకు చార్జీలు లేకపోయినా వ్యాపారులపై మాత్రం తీవ్ర ప్రభావం పడనుంది. ఈ చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయకుండా వ్యాపారులే భరించాలని స్పష్టం చేసినప్పటికీ అమలులో మాత్రం వినియోగదారులపై భారం చూపే అవకాశం ఉందని అంటున్నారు.

స్కూలు ఫీజులు,

పెట్రోల్‌ చెల్లింపులపై భారం

రైల్వే టికెట్ల బుకింగ్‌, మొబైల్‌ రీ చార్జ్‌లు, బీమా చెల్లింపులు, పెట్రోల్‌ బంకుల్లో చేసే చెల్లింపుల్లో రూ. 2వేలు దాటితే ఒక్కో లావాదేవీకి రూ.5 చొప్పున చార్జీలు పడనున్నాయి. ఇక్కడ సామాన్యులు సైతం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా పెట్రోల్‌, డీజిల్‌ కోసం రూ.2 వేలకు పైగా చెల్లించే ప్రతి చెల్లింపునకు భారం పడనుంది. పాఠశాలలు, యూనివర్సిటీల్లో యూపీఐ విధానంలో చెల్లించే ట్యూషన్‌ ఫీజులపై సైతం భారం పడనుంది. దీంతో పాఠశాల ఫీజులు, విద్యుత్‌ బిల్లులు, రీచార్జ్‌లు, బీమా చెల్లింపుల రూపంలో ఈ చార్జీలు ప్రతి ఇంటినీ ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ నగదు చెల్లింపులకు మొగ్గుచూపే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటివరకు డిజిటల్‌ చెల్లింపులతో చిల్లర సమస్యలు తీరిపోగా, ఇప్పుడు చార్జీల మోతతో మళ్లీ నగదు చెలామణి పెరిగి చిల్లర సమస్య కూడా తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement