టీపీసీసీ చీఫ్‌కు అవగాహన లేదు | - | Sakshi
Sakshi News home page

టీపీసీసీ చీఫ్‌కు అవగాహన లేదు

Sep 17 2026 2:14 AM | Updated on Sep 17 2026 2:14 AM

రాహుల్‌, రేవంత్‌, మహేశ్‌గౌడ్‌తోనే

బీజేపీకి ప్రయోజనం

కవిత అవుట్‌ డేటెడ్‌ పర్సన్‌

మీడియాతో ఎంపీ అర్వింద్‌ ధర్మపురి

సుభాష్‌నగర్‌: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పరిపాలనపై అవగాహన లేదని, ఆయన ఏనాడూ కౌన్సిలర్‌గా కూడా గెలవలేదని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రూ.లక్షన్నర కోట్లు విలువ చేసే హెచ్‌సీయూ భూములను దోచు కునేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జాతీయస్థాయిలో రాహుల్‌, రాష్ట్రస్థాయిలో రేవంత్‌రెడ్డి, జిల్లాస్థాయిలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వల్లే బీజేపీకి మరింత ప్రయోజనం కలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడమేనని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడం ఖాయమన్నారు.

టీఆర్‌ఎస్‌ అధినేత్రి కల్వకుంట్ల కవిత అవుట్‌ డేటెడ్‌ పర్సన్‌ అని, కవిత కే–ట్యాక్స్‌ వల్లే కాంట్రాక్టర్లు పారిపోయారని అర్వింద్‌ ఆరోపించారు. మాధవనగర్‌ ఆర్‌వోబీ ఆలస్యం కావడానికి కవిత కారణమని విమర్శించారు.

ఆశీర్వాద దీపం..

మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నెలరోజులపాటు సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించాలన్నారు. గురువారం సాయంత్రం ఏడు గంటలకు ప్రజలు ఆశీర్వాద దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి, నాయకులు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి, గద్దె భూమన్న, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రమోద్‌కుమా ర్‌, ఓంసింగ్‌, వెల్మ గంగారెడ్డి, అంబర్‌ అగర్వాల్‌, వంశీగౌడ్‌, ఆమంద్‌ విజయ్‌, బొబ్బిలి వేణు, పిల్లి శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement