● డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేశ్‌రెడ్డి
● వెయ్యి రోజుల పాలనపై జిల్లా కాంగ్రెస్ భవన్‌లో సంబురాలు
నిజామాబాద్ రూరల్: అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో బుధవారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యిరోజులు పూర్తవుతున్నందున కేక్‌కట్‌చేసి సంబురాలు చేసుకున్నా రు. ఈసందర్భంగా నగేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకా లు ప్రజలు అందుతున్నాయని గుర్తుచేశారు. 2029 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారు కృషి చేస్తున్నారన్నారు. రెండేళ్ల పాటు రాష్ట్రానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అనేక సేవలు చేశారని కొనియాడారు. మేయ ర్ ఉమారాణి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ, కార్పొరేషన్‌ల చైర్మన్లు గడుగు గంగాధర్, తాహెర్ బిన్ హందాన్, కవితారెడ్డి, అంతిరెడ్డిరాజిరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జావిద్‌అక్రమ్, సంతోష్, నాయకులు పాల్గొన్నారు.


