నానో యూరియా జోరు! | - | Sakshi
Sakshi News home page

నానో యూరియా జోరు!

Sep 17 2026 2:14 AM | Updated on Sep 17 2026 2:14 AM

ఖరీఫ్‌ సీజన్‌లో రికార్డు స్థాయిలో

నానో బాటిళ్ల విక్రయాలు

బస్తాతో పోలిస్తే మేలే అంటున్న రైతాంగం

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో నానో యూరియా వినియోగం గణనీయంగా పెరిగింది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం ఎకరానికి రెండు బస్తాలను మాత్రమే పరిమితం చేయడంతో రైతులు ప్రత్యామ్నాయంగా నానో లిక్విడ్‌ యూరియా వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా నానో యూరియా విక్రయాలు రికార్డు సృష్టించాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇఫ్‌కోతోపాటు ఇతర కంపెనీలు కలిపి సుమారు లక్ష వరకు బాటిళ్ల నానో యూరియాను విక్రయించాయి. ముఖ్యంగా వరి పండించే రైతులు ఈ లిక్విడ్‌ యూరియాను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. సాంప్రదాయ యూరియా బస్తాలతో పోలిస్తే నానో యూరియా ఎంతో లాభదాయకంగా ఉందని రైతులు అంటున్నారు. 45కిలోల యూరియా బస్తా కేవలం అర ఎకరానికి మాత్రమే సరిపోతుందని, రూ.225 కు లభించే అర లీటర్‌ సామర్థ్యం ఉన్న ఒక నానో యూరియా బాటిల్‌ ఒక ఎకరానికి వస్తుందని రైతులు అంటున్నారు. ఖర్చుతోపాటు శ్రమ కూడా తగ్గుతుండడంతో సాధారణ యూరియా బస్తాల కన్నా నానో యూరియానే ఎంతో మేలని రైతులు భావిస్తున్నారు. సుమారు 45వేల మంది రైతులు 1.20లక్షల ఎకరాల వరకు నానో యూరియా బాటిళ్లను వాడి మంచి ఫలితాలు సాధించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

రెండు సీజన్‌ల నుంచి వాడుతున్నా..

రబీ సీజన్‌ నుంచి ఐదెకరాల వరికి నానో లిక్విడ్‌ యూరియానే వాడుతున్నా. ఇప్పుడు కేంద్రం యూరి యా కోట తగ్గించడంతో సాధారణ యూరియా దొరకడం కష్టంగా మారింది. నానో యూరియానే ప్రత్యామ్నాయం కావడంతో దానినే వినియోగిస్తున్నా. ఒక బాటిల్‌ ఎకరానికి సరిపోతుంది. మిగతా రైతులకు కూడా నానో యూరియా వాడాలని చెబుతున్నా.

– దడిగే పెంటన్న, రైతు, డొంకేశ్వర్‌

నేలకు ఇబ్బంది లేదు

రైతులు సాంప్రదాయ ఎరువుల నుంచి నానో యూరియా వైపు మొగ్గు చూపడం శుభపరిణామం. కిల్విడ్‌ యూరియా రై తులకు ఒక అద్భుతమైన ప్ర త్యామ్నాయంగా మారింది. సాధారణ యూరియా చల్లినప్పుడు చాలా వరకు వృథా అవుతుంది. నేల స్వభావం కూడా దెబ్బతింటుంది. కానీ నానో యూరియాతో నేలకు ఇబ్బంది లేకపో గా, పిచికారీ చేయగానే నేరుగా ఆకుల ద్వారా మొక్కలకు వేగంగా అందుతుంది. – బార్ల మధుసూదన్‌,

మండల వ్యవసాయాధికారి, డొంకేశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement