ఆర్మూర్: తన నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించడానికి సమయం ఇవ్వాలని, అవసరౖ మెతే తాను ఈ రోజు రాజీనామా చేసే వెళ్లిపోతానని ఆర్మూ ర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆయన మాట్లాడారు. ఆర్మూర్ పట్టణంలో నిజాం కాలం నాటి శిథిలమైన భవనంలో తహసీల్ కార్యాలయం కొనసాగుతోందని, క్లర్క్ కూడా కూర్చోని మహిళా సంఘ భవనంలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తాత్కాలికంగా నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిగి తరహాలో ఆర్మూర్ నియోజకవర్గంలో సైతం ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ కార్యాలయాన్ని రూ.27 కోట్లతో నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ శాఖ మంత్రి తమ కు నిధులు మంజూరు చేయడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలోని కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.


