ఆక్రమణకు గురైన అటవీ భూమి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణకు గురైన అటవీ భూమి స్వాధీనం

Aug 2 2026 1:10 AM | Updated on Aug 2 2026 1:10 AM

ఆక్రమణకు గురైన అటవీ భూమి స్వాధీనం

గాంధారి(ఎల్లారెడ్డి): గాంధారి అటవీ శాఖ రేంజ్‌ పరిధిలోని గండివేట్‌ బీట్‌లో ఆక్రమణకు గురైన అటవీ శాఖ భూములను శనివారం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌ఆర్వో రమేశ్‌ తెలిపారు. గండివేట్‌ బీట్‌లో ఇటీవల అటవీ భూమిని ఆక్రమించుకుని పంట సాగు చేశారన్నారు. సదరు భూములను తిరిగి స్వాధీనం చేసుకుని కందకాలు తవ్వించినట్లు తెలిపారు. అటవీ భూమలు ఆక్రమణదారులపై చట్టప్రకారం కేసు నమోదు చేస్తామని ఎఫ్‌ఆర్వో హెచ్చరించారు. బీర్మల్‌ తండాను ఎఫ్‌ఆర్వో సందర్శించి తండావాసులతో సమావేశం ఏర్పాటు చేసి అడవులు, అటవీ భూముల సంరక్షణపై అవగాహన కల్పించారు. అటవీ శాఖ సెక్షన్‌ అధికారులు, బీట్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement