తడిహిప్పర్గాలో ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తడిహిప్పర్గాలో ఒకరి ఆత్మహత్య

Aug 2 2026 1:10 AM | Updated on Aug 2 2026 1:10 AM

మద్నూర్‌(జుక్కల్‌): మండలంలోని తడిహిప్పర్గాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. తడిహిప్పర్గా గ్రామానికి చెందిన అల్లంవార్‌ దేవిదాస్‌(26) గ్రా మంలో కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నాడు. తనకు డబ్బు లు కావాలని ఇటీవల ఇంట్లో అడగడంతో మద్యం తాగడం కోస మే డబ్బులు అడుగుతున్నావని, మద్యం తాగడం హానికరమని తండ్రి మల్లు సముదాయించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో దేవిదాస్‌ ఆవేశంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం కుటుంబసభ్యులు పోలీసులకు ఫి ర్యాదు చేయగా, మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. లెండి వాగులో శనివారం వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని, మృతుడిని దేవిదాస్‌గా నిర్ధారించి, కుటుంబీకులకు సమాచారం అందించారు. డబ్బులు ఇవ్వకపోవడంతోనే దేవిదాస్‌ వాగులో దూకి ఆత్మహత్య చేసు కున్నాడని తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement