ఖలీల్‌వాడి: ప్రతి వ్యక్తికి అన్ని బంధాలను దేవుడిస్తే, స్నేహ బంధం మాత్రం మనమే ఏర్పాటు చేసుకుంటాం. రక్తసంబంధం కాకపోయినా, స్నేహితుడు ఉంటే కష్టమొచ్చిన, నష్టమొచ్చిన మన వెంటే ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇలాంటి విలువలు ఇచ్చే స్నేహబంధానికి ప్రతీకగా ప్రతి యేటా ఆగష్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవంగా నిర్వహిస్తా రు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలోని నిశిత డిగ్రీ కాలేజీలో శనివారం విద్యార్థులతో ‘సాక్షి’ టాక్‌షో నిర్వహించగా.. పలువురు విద్యార్థులు స్నేహం, స్నేహితులపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ రోజుల్లో ఫ్రెండ్‌షిప్ చాల డిఫరెంట్‌గా ఉంది. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలియని పరిస్థితి. స్వార్థప్రయోజనాలకు స్నేహితుల మధ్య విభేధాలు వస్తాయి. చిన్ననాటి స్నేహం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తెలిసిన వారితోనే స్నేహం చేయాల్సి వస్తుంది.
–సంజన, బీబీఏ సెకండియర్, నిజామాబాద్
స్నేహనికి విలువ కట్టలేమంటున్న యువత
ఆన్‌లైన్ దోస్తీతో అప్రమత్తంగా
ఉండాలని సూచన
‘సాక్షి’ టాక్ షోలో
విద్యార్థుల అభిప్రాయం


