● ప్రతినెలా కృష్ణపక్షంలో
నాలుగో రోజున వచ్చే పర్వదినం
● గణపతి పూజ, నోములు
నిర్వహించనున్న మహిళలు
ఆర్మూర్: సంకష్టహర చతుర్థినే సంకట హర చతుర్థి అని కూడా అంటారు. ప్రతినెలా కృష్ణపక్షంలో నాలుగో రోజున వచ్చే పర్వదినా న్ని సంకష్టహర చతుర్థిగా పిలుస్తా రు. ఈరోజున గణపతి పూజలు, నోములు నోచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వినాయక చవితి లాగానే ప్రతినెలాలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున ఈ వ్రతాన్ని జరుపుకోవడం వ ల్ల భరించలేని కష్టాలు, విఘ్నాలు, ఆటంకాలు తొ లగిపోతాయని, సుఖశాంతులు, సిరిసంపదలు పొందుతామని భక్తులకు నమ్మకం. అలాగే మంగళవారం వచ్చే ‘అంగారక చతుర్థి’ విశిష్టమైనదిగా భా విస్తారు. ఈ ఏడాది జనవరి, మే నెలలో మంగళవా రం వచ్చింది. సెప్టెంబర్ 29న మరోసారి మంగళవారం రానుంది. ఈరోజు ఉపవాసం ఉంటే 21 సంకష్ట చతుర్థులు చేసిన ఫలితం వస్తుందని నమ్ము తారు. ఎర్రని పువ్వులు, ఎర్రచందనంతో దైవాన్ని పూజిస్తే కుజదోషం పోతుందని పెద్దలు చెబుతారు.
తెల్లవారుజామునుంచే..
మహిళలు ఈ రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లు అలికి, వాకిలికి పసుపు రాసి, గడపకు మామిడాకుల తోరణం కడతారు. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం. మధ్యాహ్నం గణపతి ప్రతిమను అలంకరించి, పూజలు చేస్తారు.‘ఉండ్రాళ్లు’ నైవేద్యంగా పెడతారు. కొన్ని చోట్ల గారెలు కూడా చేస్తారు. అనంతరం ‘సంకష్టహర గణపతి వ్రత కథ’ చదువుకుంటారు. కథ అయిపోయాక చంద్రుడి దర్శనం చేసుకొని, మహిళలు ఉపవాసం విరమిస్తారు.


