ఖలీల్‌వాడి: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబందించి పదవ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాల కోసం అదనపు రుసుం లేకుండా ఆగస్ట్టు15 వరకు గడువు పొడగించినట్లు డీఈవో అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ రుసుమును మీసేవ సెంటర్, ఆన్‌లైన్ సెంటర్లలలో చెల్లించవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలకు ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ తుల రవీందర్ సెల్ నెం 8008403518, 9849234696ను సంప్రదించాలన్నారు.
నిజామాబాద్ రూరల్: చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని నిజామాబాద్ చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి అన్నారు. ఇటీవల నిజామాబాద్ చేనేత సహకార సంఘం ఎన్నికలు జరుగగా, సోమవారం నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. ఈసందర్భంగా సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికై న గుజ్జ రాజేశ్వరి సంఘ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చేనేత రంగానికి పూర్వ వైభవం తెచ్చేలా పాటుపడతానన్నారు. ప్రధాన కార్యదర్శి పెంటి రాజు, కోశాధికారి నందాల నరేష్, డైరెక్టర్లు దిండిగల్ల శంకర్, కై రంకొండ బాల్‌రాజ్, కారంపూరి ప్రభు, గాలిపల్లి అరుణ, ఎన్నికల అధికారి పోశన్న, పద్మశాలి హాస్టల్ అధ్యక్షుడు దీకొండ యాదగిరి, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు, గౌరవ సలహాదారులు రా పెల్లి గురుచరణ్, నగర ఉపాధ్యక్షులు కన్న దు బ్బ రాజం, ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వ ర్, నగర సంఘం మాజీ అధ్యక్షులు సత్యపాల్, సబ్బని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: జిల్లా స్కూల్ గేమ్స్‌ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) జిల్లా కార్యదర్శిగా ఈ.శ్రీధర్ నియమితులయ్యారు. గత బుధవారం డీఈవో మల్లికార్జున్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శిగా డి.హన్మంత్‌రెడ్డి ఎన్నిక కాగా ఆయన తాను అ పదవిలో కొన సాగలేనని తెలపడంతో సీనియర్ పీఈటీ శ్రీధర్ నియమాకం అనివార్యమైంది. ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శిగా శ్రీధర్ ఏడాది కాలంపాటు కొనసాగుతారని డీఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వరగౌడ్, ఎస్‌జీఎఫ్ మాజీ కార్యదర్శి హీరాలాల్, పేటా టీఎస్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, టీజీ పేటా అధ్యక్షుడు స్వామిగౌడ్, పీఈటీలున్నారు.


