● అదనపు కలెక్టర్ భుజంగరావు
● ప్రజావాణిలో 166 వినతుల స్వీకరణ
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కా ర్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాని కి 166 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ స మస్యలను అదనపు కలెక్టర్ భుజంగరావుతో పాటు ట్రెయినీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సా యాగౌడ్, డీఆర్డీవో సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


