నిజామాబాద్ రూరల్: ప్రతి ఓటరు బాధ్యతగా వ్యవహరించి ‘సర్’ ఎన్యుమరేషన్ ఫారాలను నింపి, సకాలంలో బీఎల్వోలకు అందించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి అన్నారు. నగరంలోని 43వ డివిజన్‌లో సోమవారం సర్ ప్రక్రియ అబ్జర్వర్ గన్‌రాజ్ పర్యవేక్షణలో, బొబ్బిలి మురళి సమన్వయంతో డివిజన్ ఇన్‌చార్జి ఎర్రం గంగాధర్ ఆధ్వర్యంలో ‘సర్’పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు. నగేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఓటరూ తమ బాధ్యతగా ఎన్యూమరేషన్ ఫామ్‌ను నింపి బీఎల్‌వోలకు అందిచాలన్నారు. పార్టీపరంగా బీఎల్‌ఏలు పని చేయాలని సూచించారు. నగర అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ.. నగరంలో ‘సర్’ ప్రక్రియ 100 శాతం పూర్తయ్యేవిధంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. సర్ కో–ఆర్డినేటర్ ఆకుల లలిత, నూడా చైర్మన్ కేశవేణు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు శరత్, కోశాధికారి భక్తవత్సలమ్, జావీద్ అక్రమ్, నరేందర్, లడ్డు, కోఆర్డినేటర్ వహీద్, సలీం, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.


