రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

Jul 8 2026 1:44 AM | Updated on Jul 8 2026 1:44 AM

ఆర్మూర్‌ : పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎం.నరేందర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేష్‌ డిమాండ్‌ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలో విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం తమ డిమాండ్లను తెలియజేస్తూ ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదరిశ దుర్గా ప్రసాద్‌, ఆర్మూర్‌ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు నిఖిల్‌, రాజు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శ్రావణ్‌, సిద్దు, వినోద్‌, వెంకట్‌, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యా సంస్థల బంద్‌ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

బోధన్‌: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్లతో వామపక్ష విద్యార్థి సంఘాల అధ్వర్యంలో ఈ నెల 10 రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌ తలపెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం పట్టణ కేంద్రంలోని పీఆర్‌టీయూ భవనం ఆవరణలో బంద్‌కు సంబంధించిన వాల్‌ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. విద్యా సంస్థల బంద్‌ను విద్యార్థులు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి అనిల్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి కుషాల్‌దేవ్‌, జిల్లా ,డివిజన్‌ నాయకులు గౌతం కుమార్‌, నాగరాజు, విశాల్‌దేవ్‌,ఎండీ మోసిన్‌,వరప్రసాద్‌, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ అధికారికి

వినతిపత్రాన్ని ఇస్తున్న పీడీఎస్‌యూ నాయకులు

బోధన్‌లో పోస్టర్లను ఆవిష్కరిస్తున్న విద్యార్థి

సంఘాల జిల్లా, డివిజన్‌ ప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement