బోధన్: సర్ సర్వేలో భాగంగా ఎన్యుమరేషన్ ఫా రాలను జాగ్రత్తగా నింపి తిరిగి బీఎల్‌వోలకు అందించాలని ఎడపల్లి తహసీల్దార్ దత్తాద్రి ఓటర్లకు సూచించారు. ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వకపోతే ఓటరు జాబితాలో పేర్లు ఉండవని పేర్కొన్నా రు. మంగళవారం ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో తహసీల్దార్ పర్యటించారు.స్థానిక లక్ష్మి నర్సింహస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్ గౌడ్ నింపిన ఎన్యుమరేషన్ ఫారాన్ని స్వీకరించారు. రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌వోలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
సర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి
రుద్రూర్: ఎస్‌ఐఆర్ (సర్ ) ప్రక్రియను అధికారులు బీఎల్‌వోలు పారదర్శకంగా నిర్వహించాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ కోరారు. మంగళవారం రుద్రూర్‌లోని జవహర్‌నగర్ కాలనీలో సర్ పత్రాలు నింపుతున్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సర్ పత్రాలు నింపడంలో ఇబ్బంది పడకుండా బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు. సీనియర్ అసిస్టెంట్ గంగాధర్, ఉప సర్పంచ్ నిస్సార్, బీఎల్‌వో గంగామణి, స్థానికులు ఉన్నారు.
ఎన్యుమరేషన్ ఫారాలపై అవగాహన
మాక్లూర్ : మండలంలోని అడవిమామిడిపల్లి గ్రా మంలో మంగళవారం బీఎల్‌వోలతో కలసి మాజీ సర్పంచ్ చింత మల్లారెడ్డి ఓటర్లకు ఎన్యుమరేషన్ దరఖాస్తులపై అవగాహన కల్పించారు. సకాలంలో దరఖాస్తులను పూర్తి చేసి అధికారులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో తెండు శేఖర్, మోతిలాల్, గణపతి, డీసీ గంగాధర్, పుణ్యరాజు, నాందేవ్, ఎల్లయ్య, సాయిలు పాల్గొన్నారు.


