యూరియాపై ఆందోళన వద్దు | - | Sakshi
Sakshi News home page

యూరియాపై ఆందోళన వద్దు

Jun 14 2026 10:07 AM | Updated on Jun 14 2026 10:07 AM

నేడు నగరంలో కరెంట్‌ కోత

జిల్లా వ్యవసాయ శాఖ

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): యూరియా దొరకదనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంటలకు సరిపోయే ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ జిల్లా రైతులకు సూచించింది. జిల్లా వ్యాప్తంగా 23 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు డీఏవో వీరాస్వామి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుకింగ్‌ యాప్‌ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 1,29,824 మంది రైతులు 3,55,795 బ స్తాల యూరియాను కొనుగోలు చేసినట్లు తెలిపారు. మండలం యూనిట్‌గా అన్నిచోట్ల బుకింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉంద ని పేర్కొన్నారు. రైతుల సౌకర్యం కోసమే యాప్‌ విధానం ప్రభుత్వం అమలు చేస్తోందని, శాస్త్ర ప్రకారంగా పంటలకు నత్రజని అందించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. యా ప్‌ విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే స్థానిక ఏఈవోలు, ఏవోలు, సొసైటీ సిబ్బందిని సంప్రదించి యూరియా బుకింగ్‌ చేయించుకోవాలని సూచించారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై పురోగతి

రాష్ట్ర ప్రభుత్వం

సానుకూలంగా ఉంది

ఆర్‌ఎం ఎస్‌వీజీకే మూర్తి

నిజామాబాద్‌ రూరల్‌: ప్రభుత్వంలో టీజీఎస్‌ ఆర్టీసీ విలీనంపై పురోగతిలో స్పష్టత అభించిందని ఆ సంస్థ రీజియన్‌ మేనేజర్‌ ఎస్‌వీజీకే మూర్తి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకున్నదన్నారు. ఆర్టీసీ విలీన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ ఇప్పటికే విలీనానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించిందని తెలిపారు. అదేవిధంగా సమ్మెకాలంలో మిగిలిన డిమాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోందని పేర్కొన్నారు. విలీన ప్రక్రియలో ప్రతి ఒక్క కార్మికుడి స్వరం వినిపించాలనేది కేబినెట్‌ సబ్‌ కమిటీ యాజమాన్యం ఉద్దేశమన్నారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తామన్నారు. వారి విలువైన సూచనలు, సలహాలను కేబినెట్‌ సబ్‌ కమిటీ పరిశీలనకు పంపి అందరికీ ఆమోదయోగ్యంగా, నూటికి నూరు శాతం పారదర్శకంగా విలీన తుది ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.

వారం రోజుల్లో

64 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

నిజామాబాద్‌ అర్బన్‌ : జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో 64 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదైనట్లు ఇన్‌చార్జి సీపీ రాజేశ్‌చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో తనిఖీలు నిర్వహించగా 64 మంది పట్టుబడినట్లు పేర్కొన్నారు. 9 మందికి వారం రోజుల జైలు శిక్ష, మిగిత వారికి రూ.5 లక్షల 50 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.

రేపు జాబ్‌మేళా

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 15న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారిణి విజయలత ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీ కోసం జాబ్‌మేళా నిర్వహించనున్నామని, ఆసక్తి గల వారు ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని సూచించారు.

సుభాష్‌నగర్‌: నగరంలోని మిర్చికాంపౌండ్‌లోగల సబ్‌స్టేషన్‌ పరిధిలో మరమ్మతుల కా రణంగా ఆదివారం పలు ప్రాంతాల్లో కరెంట్‌ కోత ఉండనున్నట్లు టౌన్‌–1 ఏడీఈ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌, కాంగ్రెస్‌భవన్‌, కవితా కాంప్లెక్స్‌, రైల్వే ఫీడర్‌లో ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని ఏడీఈ కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement