సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ నెల 4న జరుగనున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఫెడరేషన్ సదస్సుకు ఎఫ్‌పీవోల చైర్మన్లు బుధవారం బయల్దేరి వెళ్లారు. జిల్లా లోని జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్ గ్రామానికి చెందిన జేఎంకేపీఎం చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డి, డైరెక్టర్ ఎం.రాజు, మోర్తాడ్ మండలం నుంచి ఎఫ్‌పీవో డైరెక్టర్ లక్ష్మీనర్సయ్య, జగిత్యాల జిల్లా ఇటిక్యాల ఎ ల్‌జీఎంఆర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు గడ్డం రాజేందర్‌రెడ్డి హాజరు కా నున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ని ర్మాణం, బలోపేతం, ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తదితర అంశాలే సమావేశం ముఖ్య ఉద్దేశమని ఎఫ్‌పీవోల ప్రతినిధులు తెలిపారు.
నిజామాబాద్‌ను ‘స్మార్ట్ సిటీ’గా ప్రకటించాలి
● అఖిల భారత మేయర్ కౌన్సిల్‌లో మేయర్ ఉమారాణి
సుభాష్‌నగర్: ఉత్తరఖండ్ రాష్ట్రంలోని రు షికేశ్‌లో బుధవారం నిర్వహించిన అఖిల భారత మేయర్స్ కౌ న్సిల్ 117వ కార్యవర్గ సమావేశానికి నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి హాజరయ్యారు. దే శవ్యాప్తంగా నగరాల అభివృద్ధి, పట్టణ పా లనలో నూతన విధానాలు, స్వచ్ఛత, మౌలి క వసతుల విస్తరణ, సుస్థిర పట్టణాభివృద్ధి అంశాలపై జరిగిన సమావేశంలో మేయర్ నిజా మాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన ప లు కీలక అంశాలను ప్రస్తావించారు. కౌన్సి ల్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్ర కటించాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ హో దా లభిస్తే నగరంలో మరిన్ని ఆధునిక మౌలి క వసతులు, సాంకేతిక సేవలు, సమగ్ర పట్టణాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
మూడురోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సుభాష్‌నగర్ : నగరంలోని 33/11 కేవీ ఆర్యగనర్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉన్న టాటా మో టార్స్ షోరూం వెనకభాగంలో కొన్ని ఏరియాల్లో ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఉద యం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వి ద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడు తుందని టౌన్–3 ఏడీఈ వినోద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ఏరియాలోని 132 కేవీ టవర్లపై లైన్ మార్చే ప్రక్రియ చేపడుతున్నందున విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
7న మున్నూరు కాపు
విద్యార్థులకు పురస్కారాలు
సుభాష్‌నగర్ : తెలంగాణ మున్నూరుకాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఇందూరు) ఆధ్వర్యంలో ఈ నెల 7న నగరంలోని ప్రగతినగర్ ము న్నూరుకాపు కల్యాణ మండపంలో పదోతరగతి, ఇంటర్, ఈపీసెట్, జేఈఈ అడ్వాన్స్ లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రతిభా పుర స్కారాలు అందజేస్తున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట రాజశేఖర్ పటేల్, అబ్బాపూర్ రవీందర్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పలువురు విద్యా ర్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నా రని పేర్కొన్నారు. ఈ ఏడాది క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన వారికి కూడా పుర స్కారాలు ఇవ్వాలని నిర్ణయించామని, వారు కూడా జిల్లా కమిటీకి పేర్లు అందజేయాలని కోరారు.


