విద్యుత్‌ డిస్కమ్‌ల విభజన వెనుక రూ. వేల కోట్ల స్కామ్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ డిస్కమ్‌ల విభజన వెనుక రూ. వేల కోట్ల స్కామ్‌

Jun 4 2026 5:34 AM | Updated on Jun 4 2026 5:34 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నరేంద్రమోదీ, చంద్రబాబునాయుడులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏజెంట్‌గా పనిచేస్తున్నరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌ మీద అవగాహనపై విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ డిస్కమ్‌లను మూడు ముక్కలు చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం వెనుక వేలకోట్ల స్కామ్‌ దాగిఉందన్నారు. ఫ్యాక్టరీలు, కమర్షియల్‌, గృహ అవసరాలకు సంబంధించి ఆదాయం వచ్చే డిస్కమ్‌లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి రూ.వేల కోట్లు దండుకునేందుకు పథకం వేశారన్నారు. ఆదాయం లేని, బిల్లులు రాని రైతు వ్యవసాయ, మిషన్‌ భగీరథ, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కనెక్షన్లను కలిపి ’రైతు డిస్కమ్‌’గా మారుస్తున్నారన్నారు.

గతంలో ఏటా రూ.10 వేల కోట్లు ఉచిత వ్యవసాయ విద్యుత్‌ కోసం వాడేవాళ్లమన్నారు. ఇప్పుడు రూ.35 వేల కోట్ల బాకీని రైతు డిస్కమ్‌లపై నెడుతున్నారని ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అందకుండా కుట్ర చేస్తున్నారన్నారు. నగరంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో బస్‌స్టేషన్‌ కోసం కేటాయించిన స్థలాన్ని కాంగ్రెస్‌ పార్టీ కోసం దండుకున్నారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ గడ్డపైకొచ్చి పునర్నిర్మాణం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి వార్డు లో విజయవంతం చేయాలని ప్రశాంత్‌ రెడ్డి కోరా రు. ‘సర్‌’ కింద అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా బీఆర్‌ఎస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నా రు. మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌ గుప్తా, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌లు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదును బాధ్యతగా తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మె ల్సీ వీజీ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు హనుమంత్‌ సింధే, జాజాల సురేందర్‌, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, నీతు కిరణ్‌, నుడా మాజీ చైర్మన్‌ ప్ర భాకర్‌ రెడ్డి, సిర్పరాజు, సత్య ప్రకాష్‌ పాల్గొన్నారు.

మోదీ, చంద్రబాబులకు ఏజెంట్‌గా

సీఎం రేవంత్‌రెడ్డి

రైతులకు ఉచిత విద్యుత్‌

తొలగించేందుకు కుట్ర

బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement