మంజీర నదిలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

మంజీర నదిలో ఉద్రిక్తత

Jun 4 2026 5:34 AM | Updated on Jun 4 2026 5:34 AM

బోధన్‌: మంజీర నదిలోని మన భూభాగంలో మ హారాష్ట్ర కాంట్రాక్టర్ల ఇసుక తవ్వకాలను రెవెన్యూ, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బుధవారం సాలూర మండల తహసీల్దార్‌ అజ్మీత్‌ నవాజ్‌, రెవెన్యూ సిబ్బంది, బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌ నేత్రుత్వంలో డివిజన్‌ పరిధిలోని బోధన్‌ రూరల్‌, ఎడపల్లి, రెంజల్‌, రుద్రూర్‌ మండలాల సీఐలు, ఎ స్సైలు, సిబ్బంది కలిసి సాలూర మండలం హు న్సా, మందర్నా గ్రామ శివారులోని మంజీర నదిలోకి వెళ్లారు. అక్కడ మన భూభాగంలో ఇసుక త వ్వకాలు జరుపుతున్న మహారాష్ట్రలోని బిలోలి తాలూకా బోలేగాం ఇసుక క్వారీ జేసీబీలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బోలేగాం క్వారీ నిర్వాహకుల అనుచరులు, ఆ గ్రామస్తులు పదుల సంఖ్యలో వచ్చి మన పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మా ప్రాంతంలోనే ఇసుక తవ్వకాలు సాగు తున్నాయని వాదించారు. వాగ్వివాదాల అనంతరం మంజీర నదిలో సరిహద్దులను గుర్తించేందుకు జాయింట్‌ సర్వే నిర్వహించాలని ఇరు రాష్ట్రా ల రెవెన్యూ, పోలీసు అధికారులు ఒక అంగీకారానికి వచ్చారు. అప్పటి వరకు ఇసుక తవ్వకాలు, రవాణను నిలిపి వేయాలని మన అధికారుల సూచనను మహారాష్ట్ర అధికారులు ఒప్పుకున్నారు. ఈ నెల 5న బోలేగాం క్వారీ వద్ద రెండు రాష్ట్రాల రెవె న్యూ, ల్యాండ్‌ సర్వే శాఖల అధికారులతో జాయింట్‌ సర్వే చేపట్టనున్నామని తహసీల్దార్‌ అజ్మీత్‌ న వాజ్‌ తెలిపారు. మంజీరలోని మన హద్దుల్లోకి వచ్చి మహారాష్ట్ర ఇసుక కాంట్రాక్టర్లు తవ్వకాలు చేపట్టారని సమాచారం మేరకు మంగళవారం సాలూర మండల రెవెన్యూ, ల్యాండ్‌సర్వే, మైనింగ్‌ అధికారులు సర్వే నిర్వహించి నిర్ధారించారు.

మన భూభాగంలో ‘మహా’

ఇసుక తవ్వకాలు

అడ్డుకున్న సాలూర రెవెన్యూ సిబ్బంది, బోధన్‌ డివిజన్‌ పోలీసులు

వాగ్వాదాల అనంతరం సరిహద్దుల జాయింట్‌ సర్వేకు అంగీకారం

ఈనెల 5న సర్వే నిర్వహించనున్న

ఇరురాష్ట్రాల అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement