జీజీహెచ్‌లో ప్లాస్టిక్‌ సర్జరీలు విజయవంతం | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో ప్లాస్టిక్‌ సర్జరీలు విజయవంతం

Jun 4 2026 5:34 AM | Updated on Jun 4 2026 5:34 AM

సుభాష్‌నగర్‌: నగరంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో జరిగిన తొలి, క్లిష్ట ప్లాస్టిక్‌ సర్జరీలు రెండు విజయవంతమయ్యాయని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీవీ నాగమోహన్‌ తెలిపారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన లచ్చవ్వ ముఖంపై ఎడ మ కన్ను కింద భాగంలో బాసల్‌ సెల్‌ కార్కినోమ వ్యాధితో బాధపడుతోంది. వ్యాధి నిర్ధారణ కావడంతో శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్‌ విజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ శివానీ ఆధ్వర్యంలో రొటేషన్‌ ఫ్లాప్‌ రీకన్‌స్ట్రక్షన్‌ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అదేవిధంగా నగరానికి చెందిన మమత కాలిభాగంలో దీర్ఘకాలంగా మానని గాయం కారణంగా తీవ్రంగా బాధపడుతోంది. ఆమెకు ఫ్లాప్‌ కవర్‌, స్ల్పిట్‌ థిక్‌నెస్‌ స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. చికిత్స ద్వారా రోగులు సాధారణ జీవన విధానానికి తిరిగి చేరుకునే అవకాశం కలిగిందని సూపరింటెండెంట్‌ నాగమోహన్‌ తెలిపారు. ఆధునిక ప్లాస్టిక్‌ సర్జరీ సేవల ద్వారా ప్రజలకు నాణ్యమై న వైద్యం జీజీహెచ్‌లో అందుతుందని పేర్కొన్నా రు. ప్రజలకు అత్యాధునిక సేవలు అందించేందుకు ఆస్పత్రి వైద్యబృందం కట్టుబడి ఉందన్నారు. వైద్యుల బృందాన్ని అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement