కమ్మర్‌పల్లి : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లిలో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో హరిత తెలంగాణ, స్వచ్ఛమైన పర్యావరణం, ఆరోగ్యకరమై న భవిష్యత్ అనే నినాదంతో బైక్ ర్యాలీ చేప ట్టారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి జాతీ య రహదారి మీదుగా పోలీస్‌స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో డీఆర్వోలు శ్రీనివాస్, సిద్ధార్థ, ఎఫ్‌ఎస్‌వోలు బాపూరావు, రాజేందర్, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
రెంజల్(బోధన్): రెంజల్‌లోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీలో 40 సీట్లు ఖాళీగా ఉన్నా యని ప్రిన్సిపల్ శ్యామల తెలిపారు. అర్హులైన బాలికలు ఈ నెల 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సెస్సీ ఫలితాల జాబితా, ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు రెండు పాస్‌పోర్టు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. బైపీసీ ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే అవకాశం ఉందని తెలిపారు.
ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య
ఆర్మూర్‌టౌన్ : ప్రభుత్వ కళాశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కళాశాల ప్రిన్సిపల్ సుభాష్ అన్నారు. ఆర్మూర్, పెర్కిట్, మామిడిపల్లిలో ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల అధ్యాపకులు పదో తరగతి పాసైన విద్యార్థుల ఇంటింటికి తిరిగి ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రశేఖర్, నరే శ్, లక్ష్మణ్, శ్రీనివాస్, రామకృష్ణ, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
బరువు కొలిచే పరికరం వితరణ
కమ్మర్‌పల్లి : కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్‌పల్లి ఆధ్వర్యంలో బుధవారం బరువు కొలిచే పరికరాన్ని(వెయింగ్ మిషన్)ను వితరణ చేశారు. సర్పంచ్ మెహబూబ్, ఉప సర్పంచ్ సట్ట విశాల్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లుక్క గంగాధర్, సభ్యులు తెడ్డు రమేశ్, నోముల నరేందర్ రెడ్డి, బద్రి, గుండోజీ రవీందర్, చిలివేరి పవన్‌కుమార్, సురంగి చంద్రశేఖర్, హెచ్‌ఈవో సత్యనారాయణ, ఫార్మసిస్ట్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంఈవోకు సన్మానం
రుద్రూర్: మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రామ్‌సింగ్‌ను బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విద్యారంగ అభివృద్ధికి కృషి చేసి మండలంలో పాఠశాలల పురోగతికి తోడ్పడాలని ఆకాంక్షించారు. క్లబ్ అధ్యక్షుడు కేవీ మోహన్, సభ్యులు శ్యామ్ సుందర్ పహాడే, పత్తి రాము, గుండూరి ప్రశాంత్ గౌడ్, పుట్టి సాగర్, గెంటిల గంగాధర్, గాండ్ల మధు, అడ్ప సుమన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యా శిరోమణికి
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ రూరల్ : విద్యా శిరోమణి అవార్డ్స్–2026కు జిల్లాలోని కుమ్మర శాలివాహన కులానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(సేవా) జిల్లా అధ్యక్షుడు మర్రిపల్లి భూపతి బుధవారం తెలిపారు. పదో తరగతిలో 500కు పైగా, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 900కుపైగా మార్కులు సాధించినవారు తమ వివరాలను ఈనెల 4 వరకు 99123 37702 ఫోన్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు. పురస్కారాలు, ప్రశంసపత్రాలు అందిస్తామని తెలిపారు.


