నిధులు మంజూరు చేయించాలి | - | Sakshi
Sakshi News home page

నిధులు మంజూరు చేయించాలి

Jun 4 2026 5:34 AM | Updated on Jun 4 2026 5:34 AM

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని సర్పంచ్‌ అంక్సాపూర్‌ దేవేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గసభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అంకాపూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాభివృద్ధిపై ఎమ్మెల్యేతో చర్చించారు. రూ.200 కోట్లతో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను మంజూరు చేయించిన ఎమ్మెల్యేను ఈ సందర్భంగా పాలకవర్గసభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ తుకారాం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

నేటి నుంచి వార్డు సభలు

ఆర్మూర్‌టౌన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని 36 వార్డులలో గురువారం నుంచి వార్డు సభలను నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ శ్రీహరి రాజు తెలిపారు. 1, 2, 3, 14, 15, 16, 17, 18, 29, 35, 36 వార్డులకు సంబంధించి పట్టణంలోని బాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 6వ తేదీన 8, 9, 10, 24, 25, 26, 27, 28 వార్డుల సభను సైదాబాద్‌లోని షాదీ ఖానలో, ఈ నెల 8వ తేదీన 11, 12, 13, 30, 31, 32, 33, 34 వార్డుల సభను జెండాగల్లీలోని వేంకటేశ్వర కల్యాణ మండపంలో, 4, 5, 6, 7, 19, 20, 21, 22, 23 వార్డు సభను పెర్కిట్‌లోని ఎమ్మార్‌ గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలకు మున్సిపల్‌, వ్యవసాయ, విపత్తు నిర్వహణ, పో లీస్‌, ఎకై ్సజ్‌, నీటి పారుదల శాఖల అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు.

బోధన్‌లో 4 రోజులపాటు..

బోధన్‌టౌన్‌(బోధన్‌): బోధన్‌ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో నాలు గు రోజులపాటు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించునున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జాదవ్‌ కృష్ణ తెలిపారు. 4న బల్దియా పరిధిలోని 1 నుంచి 10 వారికి, 6న 11 నుంచి 20వ వార్డు వరకు, 8న 21 నుంచి 29వ వార్డు వరకు, 10న 30 నుంచి 38వ వార్డు ప్రజలు సభలలో పాల్గొనాలని కోరారు.  

ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పించాలి

బోధన్‌: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఎడపల్లి సర్పంచ్‌ కందగట్ల రాంచందర్‌, జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం వేములపల్లి రవికుమార్‌ తెలిపారు. బడిబాటలో భాగంగా బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పని ప్రదేశానికి వెళ్లి కూలీలతో మాట్లాడారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారని హెచ్‌ఎం తెలిపారు. ఉపసర్పంచ్‌ గంగాధర్‌, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, సంజీవ్‌కుమార్‌, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement