ఎరువులను సకాలంలో అందజేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎరువులను సకాలంలో అందజేయాలి

Jun 4 2026 5:34 AM | Updated on Jun 4 2026 5:34 AM

జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌ రావు

రుద్రూర్‌ : సహకార సంఘ పరిధిలోని రైతులకు అ వసరమగు ఎరువులను సకాలంలో అందజేయాల ని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌ రావు సూచించారు. మండల కేంద్రంలోని సింగిల్‌ విండో కార్యా లయాన్ని బుధవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రుణమా ఫీ ఖాతాలు, ఎరువుల నిల్వలు, యూరియా విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించా రు. అనంతరం పాలకవర్గ సభ్యులతో మాట్లాడా రు. ఇప్పటి వరకు సంఘ పరిపాలన బాధ్యతలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బాధ్యతలు వద్దంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని సూ చించారు. డైరెక్టర్లు మాట్లాడుతూ గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో విండో కార్యదర్శిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో షోకాజ్‌ నోటీసు జారీ చేయకపోవడంపై డీసీవో అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకతవకలు నిర్ధారణ అయితే కార్యదర్శిని సస్పెండ్‌ చేసే అధికారం పాలకవర్గానికి ఉంటుందని పేర్కొంటూ, ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement