సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

Jun 4 2026 5:34 AM | Updated on Jun 4 2026 5:34 AM

డీఎంహెచ్‌వో రాజశ్రీ

పెర్కిట్‌(ఆర్మూర్‌): రానున్న వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ వైద్య సిబ్బందికి సూచించారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో నిర్వహిస్తున్న టీకాల కా ర్యక్రమాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల 28న చేపట్టనున్న పల్స్‌ పోలియో కార్యక్రమానికి ఐదేళ్ల లోపు పిల్లల జాబితాను తయారు చేసి పెట్టుకోవాలని సూచించారు. అనంతరం మందుల నిల్వల రిజిస్టరు, ఓపీ రి జిస్టరు, వ్యాధి నిరోధక టీకాల అర్హుల జాబితాను పరిశీలించారు. ఆర్మూర్‌ మండలం చేపూర్‌ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్‌ అ ధికారి అశోక్‌ పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ప్రీతి పావని, ఆరోగ్య కార్యకర్తలు జక్కుల మోహన్‌, సువర్ణ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement