నిజాంషుగర్స్‌ కార్మికులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నిజాంషుగర్స్‌ కార్మికులను ఆదుకోవాలి

Jun 4 2026 5:34 AM | Updated on Jun 4 2026 5:34 AM

బోధన్‌: మూతపడిన ఎన్డీఎస్‌ఎల్‌ ( నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌) కార్మికుల బకాయి వేతనాలు చె ల్లించి ఆదుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఫ్యాక్టరీ ప్రధాన గేటు ఎదుట బుధవారం కార్మిక సంఘాల ఆధ్వ ర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపేందర్‌, రవిశంకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ లేఆఫ్‌ ప్రకటించి ఇప్పటి వరకు 11 ఏళ్లు పూర్తి కావొస్తున్నా కార్మికుల బకాయి వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతాదృక్పథంతో కార్మికులను ఆదుకోవాలని కోరారు. కార్మిక నాయకులు బాలకృష్ణ, రాజారాం, దేవదాసు, బాలచందర్‌, భాస్కర్‌, భిక్షపతి, భూమయ్య, శ్రీధర్‌ పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌పై సదస్సు

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలోని రైతువేదిక భవనంలో వివిధ పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులకు బుధవారం ఎస్‌ఐఆర్‌పై శిక్షణ సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రతీ ఓటర్‌ మ్యాపింగ్‌ చేయించుకోవాలని, 2002 ఓటర్‌ లిస్టులోని ప్రస్తుత ఓటరు వారసులతోపాటు తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. రెవె న్యూ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement