రుద్రూర్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలో జాతీయ పతాకం రూపంలో కేక్ తయారు చేయించి కట్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు బోజగొండ అనిల్, మండల నాయకులు వడ్ల సాయినాథ్, రేపల్లి సాయిప్రసాద్, కుమ్మరి గణేశ్, తీగుళ్ల రాజా వరప్రసాద్, బైండ్ల బాలరాజ్, ధర్మరం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ : మండలంలోని హుస్సేన్‌నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కేసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యం చెందడం, ప్రజా వ్యతిరేక పాలన నచ్చక బీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన శ్రీనివాస్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీసీ గౌడ్,పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ అభినందించారు.


