అర్హులకే సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులకే సంక్షేమ ఫలాలు

Jun 4 2026 5:34 AM | Updated on Jun 4 2026 5:34 AM

బోధన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తుందని ప్రభు త్వ సలహదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, నుడా చైర్మన్‌ కేశవేణు, తహసీల్దార్‌ దత్తాద్రి, ఎంపీడీవో శంకర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బిల్ల రాంమోహన్‌, ఏంఎసీ డైరెక్టర్‌ బొబ్బిలి శ్రీనివాస్‌, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement