మన పసుపే మిన్న.. | - | Sakshi
Sakshi News home page

మన పసుపే మిన్న..

Jun 1 2026 12:56 AM | Updated on Jun 1 2026 12:56 AM

మోర్తాడ్‌(బాల్కొండ): పసుపు సాగులో అగ్రగామిగా నిలుస్తున్న మన ప్రాంతానికి సాంగ్లీ మార్కెట్‌లో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తోంది. అక్కడి మార్కెట్‌కు మన జిల్లాతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి పసుపు వెళ్తుండగా, మన దగ్గర నుంచి వెళ్లిన కొమ్ములకు అక్కడి వ్యాపారులు ఎక్కువ ధర నిర్ణయించడం విశేషం. మన జిల్లా నుంచి వెళ్లిన పసుపు కొమ్ములకు రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకు చెల్లిస్తున్నారు. నాణ్యత ఆధారంగా ధర చెల్లించే సాంగ్లీ వ్యాపారులు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వెళ్లిన పసుపునకు రూ.13 వేలకు మించి ధర చెల్లించడం లేదు. మన జిల్లాలోని అంక్సాపూర్‌, గుమ్మిర్యాల్‌, దోంచంద, దొన్కల్‌, పడగల్‌, వన్నెల్‌(బీ), అంకాపూర్‌ తదితర గ్రామాల నుంచి ఎక్కువగా సాంగ్లీకి పసుపును రైతులు తరలిస్తారు. నిజామాబాద్‌ మార్కెట్‌తో పోలిస్తే ఎక్కువ ధర లభించడం, నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తుండడంతో సీజన్‌లో రోజుకు రెండు, మూడు లారీల పసుపు సాంగ్లీ మార్కెట్‌కు ఎగుమతి అవుతోంది. మన రైతుల శ్రమకు తగిన ఫలితం కాకపోయినా ఇతర రాష్ట్రాల రైతుల కన్నా ఎక్కువ ప్రాధాన్యం మన వాళ్లకు దక్కడ ప్రత్యేక గుర్తింపుగా చెప్పుకోవచ్చు.

సాంగ్లీలో కర్ణాటక, మహారాష్ట్ర

కొమ్ములకన్నా ఎక్కువ ధర

నాణ్యతకు పెద్దపీట వేస్తున్న

అక్కడి వ్యాపారులు

ఇతర రాష్ట్రాల పసుపునకు

రూ.2 వేలు తక్కువ ధర

Advertisement
 
Advertisement
Advertisement