రెంజల్(బోధన్): రెంజల్, కోటగిరి మండలాలకు చెందిన నలుగురు యువకులు అగ్నివీర్‌కు ఎంపికయ్యారు. రెంజల్ మండలంలోని కళ్యాపూర్ గ్రామానికి చెందిన ఒడ్డెక్క అక్షయ్‌కుమార్, ఒడ్డెక్క భరత్, రెంజల్‌కు చెందిన గైని శివానంద్ అగ్నివీర్‌కు అర్హత సాధించారు. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు భానుచందర్, తిరుపతి లలిత, కాంగ్రెస్ నాయకులు యువకులను అభినందించారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీహరి అగ్నివీర్‌కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలుర) ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ ముబీన్ శ్రీహరిని అభినందించారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సేకరించి ఆదివారం బాధితులకు అందజేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మొత్తం 6 ఫోన్లను బాధితులకు అందజేశామని పేర్కొన్నారు.
సిరికొండ: మండలంలోని జినిగ్యాల తండా అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా వంట చెరుకును తరలిస్తున్న ఎడ్లబండిని స్వాధీనం చేసుకున్నట్లు సిరికొండ ఎఫ్‌ఆర్వో నర్సింగరావు ఆదివారం తెలిపారు. పెట్రోలింగ్‌లో భాగంగా వంట చెరుకుతో కూడిన ఎడ్ల బండిని గమనించిన స్థానిక బీట్ అధికారి సతీశ్.. ఆ బండి వద్ద ఎవరూ లేకపోవడంతో దాన్ని స్వాధీనం చేసుకొని సిరికొండలోని రేంజ్ కార్యాలయానికి తరలించారు. విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఎఫ్‌ఆర్వో తెలిపారు.


