బస్సులు కొనుగోలు చేసిన సమాఖ్యలు
గర్వకారణం...
● ఆర్టీసీలో మండల సమాఖ్యల పెట్టుబడి
● జిల్లాకు చేరిన 18 బస్సులు
● అద్దె రూపంలో ఎంఎస్‌లకు
ఏడేళ్లపాటు ఆదాయం
డొంకేశ్వర్(ఆర్మూర్): రుణాలు పొందుతూ వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా సంఘాలు ఇప్పుడు రవాణా రంగంలోకి కూడా అడుగు పెట్టాయి. ప్రభుత్వ చేయూతకు వారి సొంత నిధులను జోడించి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇస్తున్నాయి. ఒక్కో బస్సుకు రూ.36 లక్షలు వెచ్చించడానికి జిల్లాలో 28 మండల సమాఖ్యలు ముందుకు వచ్చాయి. ఇప్పటి వరకు రెండు విడతల్లో 18 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించారు. మిగతా 10బస్సులను కూడా జక్రాన్‌పల్లి, మెండోరా, ఏర్గట్ల, ముప్కాల్, మోర్తాడ్, నవీపేట్, మాక్లూర్, మోపాల్, బోధన్, నందిపేట్ మండల సమాఖ్యలు కొనుగోలు చేసే పనిలో ఉన్నాయి. అయితే ఆదాయ మార్గాల కోసం వెతుక్కుంటూ ధైర్యంగా పెద్ద పెట్టుబడులు పెట్టడం నారీ శక్తికి నిదర్శనమనే చెప్పొచ్చు.
ఏడేళ్ల పాటు నిలకడైన ఆదాయం
జిల్లాలో ప్రతి మండల సమాఖ్య ఒక బస్సును కొనుగోలు చేస్తోంది. ఒక బస్సుకు రూ.36 లక్షల ఖర్చు అవుతుండగా మండల సమాఖ్యలు తమ వద్ద ఉన్న సొంత నిధుల్లో రూ.6 లక్షలు వినియోగిస్తున్నాయి. మిగిలిన రూ.30 లక్షలను ప్రభుత్వం కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (సీఐఎఫ్) కింద మంజూరు చేస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా మండల సమాఖ్యలకు నిలకడైన ఆదాయం లభించనుంది. ఒప్పందంలో భాగంగా ఒక్కో బస్సుకు ప్రతి నెలా రూ.69,486 చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లించనున్నది. ఈ ఆదాయం ఏడేళ్ల పాటు మండల సమాఖ్యలకు అందుతుంది. తద్వారా ఎంఎస్‌లు మరింత బలోపేత కావడంతోపాటు మహిళల్లో వ్యాపార నైపుణ్యాలు పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వర్ని, చందూర్, మోస్రా,రుద్రూర్, కోటగిరి, ఎ డపల్లి,ఆర్మూర్,బాల్కొండ, వేల్పూర్, రెంజల్, భీమ్‌గల్, ధర్పల్లి, బోధన్, ఇందల్వాయి, నిజామాబాద్‌రూరల్, డిచ్‌పల్లి, సిరికొండ, కమ్మర్‌పల్లి
మండల సమాఖ్యలు పెట్టుబడి పెట్టి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వడం చాలా గర్వకారణం. ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు మ హిళా శక్తికి నిదర్శనం. ఆ ర్టీసీ నుంచి వచ్చే ఆదాయంతో మండల సమాఖ్య లు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నాం.
– సాయన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి


