రైతులకు ఇబ్బందులు కలగొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బందులు కలగొద్దు

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

మోర్తాడ్‌(బాల్కొండ): రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులను కలెక్ట ర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మోర్తాడ్‌, దోన్‌ పాల్‌లలోని కొనుగోలు కేంద్రాలను సోమవా రం ఆమె పరిశీలించారు. దొడ్డు ధాన్యంలో నూక శాతం ఎక్కువగా వస్తుండడంతో తా ము నష్టపోతున్నామని రైస్‌ మిల్లర్లు అంటున్నారని, నూకశాతం రాని రకాలు సాగు చేస్తే బాగుంటుందని కలెక్టర్‌ అక్కడ ఉన్న రైతులతో అన్నారు. వచ్చే సీజన్‌ నుంచి ఏ రకం సాగు చేయాలో సూచించి రైతులను చైతన్యపరుస్తామన్నారు. దొడ్డు రకాల విషయంలో కొంత సమస్య ఉందని.. పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. తరుగు ఎక్కువ తీస్తున్నారని, లారీల డ్రైవర్‌లకు ఒక్కో సంచికి రూ.4 చెల్లిస్తున్నామని రైతులు కలెక్టర్‌కు వివరించగా.. ఆధారాలు చూపితే కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ మాల్వియా తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement