ప్రజలకు, ప్రభుత్వానికి అధికారులు వారధిగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు, ప్రభుత్వానికి అధికారులు వారధిగా నిలవాలి

May 3 2026 8:17 AM | Updated on May 3 2026 8:17 AM

అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ

సుభాష్‌నగర్‌: ప్రజలకు, ప్రభుత్వానికి ప్రభుత్వ ఉ ద్యోగులు వారధిగా నిలిచి ప్రజాభివృద్ధికి కృషి చే యాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని శ్రీరామ గార్డెన్‌లో శనివారం అర్బన్‌ నియోజకవర్గ స్థాయి ప్ర జాపాలన –ప్రగతి ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా చర్య లు చేపడుతున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ అన్నారు. అనంతరం మేయర్‌, మున్సిపల్‌ కమిషనర్‌తో కలిసి ఎమ్మెల్యే స్టాళ్లను సందర్శించారు. నుడా చైర్మన్‌ కేశవేణు, అడిషనల్‌ కమిషనర్‌ రవీందర్‌ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement