● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
డిచ్‌పల్లి/నిజామాబాద్‌రూరల్:ఇందిరమ్మ రాజ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రా ష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ ఫలా లు అందుతున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్‌లో శనివారం ‘ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. గ్రామ సంఘాలకు, మహిళా సమాఖ్య మార్కెటింగ్ కమిషన్‌కు రూ.2,59,98,556 విలువ చేసే చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీఎల్‌పీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


