నందిపేట్(ఆర్మూర్): మండలంలోని తిమ్మరాజుపల్లి గ్రామంలోని రైతు వేదికలో శనివారం ‘ప్రగతి ప్ర ణాళిక’లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగా ణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈసందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త రమ్య రా థోడ్ మాట్లాడుతూ..మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతులు లాభదాయకమైన వ్యవసాయం చేయవచ్చని తెలిపారు. ఏ వో రాంబాబు,సర్పంచ్ లావణ్యమురళి,ఉప సర్పంచ్ నరేందర్, ఏఈవో విజయ్, రైతులు పాల్గొన్నారు.


