ఆర్మూర్‌ విద్యుత్‌ కార్మికులకు అవార్డు | - | Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌ విద్యుత్‌ కార్మికులకు అవార్డు

May 3 2026 8:17 AM | Updated on May 3 2026 8:17 AM

ఆర్మూర్‌ విద్యుత్‌ కార్మికులకు అవార్డు ‘బ్యాక్‌ వాటర్‌’ వడ్లను కొనాలి పంచాయతీరాజ్‌ వర్క్‌షాప్‌లో నందిపేట సర్పంచ్‌ ఘనంగా రథోత్సవం

ఆర్మూర్‌టౌన్‌:హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రా ష్ట్ర విద్యుత్‌ కార్మిక యూనియన్‌ ఐఎన్‌టీయూసీ– 327 ఆధ్వర్యంలో నిర్వహించిన మే డే వేడుకల్లో ఆ ర్మూర్‌ డివిజన్‌ అధ్యక్ష సల్ల శ్రీనివాస్‌ యాదవ్‌, కా ర్యదర్శి గ్యాదరి ప్రభాకర్‌లకు‘శ్రమశక్తి’ అవార్డు ల భించింది.జిల్లాకు 6కార్మికశక్తి అవార్డులు వచ్చాయి.

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మండలంలోని ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతంలో పట్టాలేని భూముల్లో సాగైన వడ్లను కొనుగోలు చేయాలని డొంకేశ్వర్‌ సొసైటీ చైర్మన్‌ భరత్‌రాజ్‌ రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.

నందిపేట్‌(ఆర్మూర్‌):హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఆత్మనిర్భర్‌ పంచాయత్‌ రాజ్‌ వర్క్‌షాప్‌లో నందిపేట్‌ సర్పంచ్‌, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు లింగం పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామీ ణ అభివృద్ధి, స్థానిక స్వయంపాలన బలోపేతం, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ఈ వర్క్‌షాప్‌ కీలకంగా నిలిచిందన్నారు. పంచాయత్‌ రాజ్‌ వ్యవస్థను మరింత ఆత్మనిర్భర్‌గా తీర్చిదిద్దడానికి అవసరమైన అంశాలపై చర్చలు జరిపారు.

వర్ని: చందూర్‌లో రే ణుక ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం రాత్రి గ్రామస్తు లు ఘనంగా నిర్వ హించారు.అనంత రం ఆలయం వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన రథంపై పూజారిని కూర్చోబెట్టి ఆలయం చుట్టూ తిప్పి ఉత్సవాలు నిర్వహించారు. శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు.

బెల్ట్‌షాపుల కట్టడికి చర్యలు

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలో బెల్ట్‌షాపుల కట్టడికి కృషి చేస్తున్నట్లు ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అక్రమంగా మద్యం విక్రయాలు, అనధికారిక మద్యం దుకాణా ల నిర్వాహనను కట్టడి చేస్తున్నామన్నారు. ఈ ఏడా దిలో ఇప్పటి వరకు మొత్తం 64 కేసులు నమోదు చేసి 62 మందిని అరెస్టు చేశామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement