‘మొబైల్‌ బ్యాంకింగ్‌’తో సేవలు సులభం | - | Sakshi
Sakshi News home page

‘మొబైల్‌ బ్యాంకింగ్‌’తో సేవలు సులభం

May 3 2026 8:17 AM | Updated on May 3 2026 8:17 AM

అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌

సుభాష్‌నగర్‌: మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ద్వారా ఎప్పుడైనా,ఎక్కడైనా సురక్షితమైన బ్యాంకింగ్‌ సేవ లు సులభంగా, వేగంగా పొందవచ్చని అదనపు క లెక్టర్‌ కిరణ్‌కుమార్‌ సూచించారు. నగరంలోని జి ల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్‌డీసీసీబీ) ప్రధాన కార్యాలయంలో మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ను శనివారం అదనపు కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతికయుగంలో రైతులు,ఖాతాదారులు సులభంగా విని యోగించుకునేలా ఈ మొబైల్‌ అప్లికేషన్‌ ను రూ పొందించారని తెలిపారు. త్వరలోనే యూ పీఐ సే వలు కూడా అందుబాటులోకి రానున్నాయన్నారు. ఆర్థిక సంవత్సరం 2025–26లో ఉత్తమ ఫలి తాల ను సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్న నేపథ్యంలో బ్యాంకు సిబ్బందిని అదనపు కలెక్టర్‌ అభినందించారు.ఇదే స్ఫూర్తిని ము న్ముందు కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. బ్యాంకు సీఈవో నాగభూషణం వందే మాట్లాడు తూ మొ బైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ లో అందుబాటులో ఉందన్నారు.ఖాతాదారులు వి నియోగించుకోవచ్చని,మరిన్ని వివరాలకు సమీప శాఖాధికారిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస్‌రావు, బ్యాంకు ఉన్నతాధికారులు లింబాద్రి, సుమమాల, గజానంద్‌, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement