హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

May 3 2026 8:17 AM | Updated on May 3 2026 8:17 AM

డీఎంహెచ్‌వో రాజశ్రీ

గుండారం పల్లె దవాఖానా తనిఖీ

నిజామాబాద్‌ రూరల్‌: అర్హులైన కిశోర బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తీసుకోవాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ అధికారులను ఆదేశించారు. ముదక్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుండారం పల్లె దవాఖానను శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న సేవలను, హాజరు, స్టాకు రిజిస్టర్లను పరిశీలించారు. ఈడీడీ క్యాలెండర్‌, గర్భిణుల నమోదు, అత్యంత ప్రమాద లక్షణాలు గల గర్భిణుల గుర్తింపు, జీవనశైలి వ్యాధులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో భాగంగా క్షయరహిత గ్రామం కోసం కృషి చేయాలన్నారు. ఆమె వెంట ఆస్పత్రి ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్‌ కవిత, ఆరోగ్య కార్యకర్త రఘు, ఆశాకార్యకర్తలు ఉన్నారు.

రెంజల్‌ ఆస్పత్రి..

రెంజల్‌(బోధన్‌): రెంజల్‌ ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం డీఎంహెచ్‌వో రాజశ్రీ తనిఖీ చేశారు. ఆస్పత్రి వచ్చే రోగులకు ఇబ్బందులు రానీయకుండా వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని ఆమె సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement