నిజామాబాద్‌అర్బన్: జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం దత్తత సహాయ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మిషన్ వాత్సల్య పోర్టల్ ద్వారా పిల్లల అడాప్షన్ ప్రక్రియ ఆన్‌లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు. అక్రమంగా దత్తత తీసుకున్న వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోకి వచ్చే ప్ర జలకు హెల్ప్ డెస్క్ ద్వారా దత్తత ప్రక్రి యకు కావాల్సిన పత్రాలను, ప్రభుత్వ మా ర్గదర్శకాలను అందజేయాలని సూచించారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన దంపతులకు బాలుడిని దత్తత ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకు మార్ కార్యాలయం సిబ్బంది అనిత, అనిల్, స్రవంతి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
ముందస్తుగా పన్ను చెల్లించిన ఎమ్మెల్యే
సుభాష్‌నగర్: ఆస్తి పన్ను చెల్లింపుపై ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీ రిబేట్‌ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సద్వినియోగం చేసుకున్నారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను శుక్రవారం ముందస్తుగా చెల్లించారు. ఇంటిపన్నుతోపాటు వ్యాపార సంస్థలకు సంబంధించిన పన్ను మొత్తం రూ.11.75 లక్షలు చెల్లించారు. మున్సిపల్ శాఖ కల్పిస్తున్న అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు.
సీసీ కెమెరాలకు
కేఆర్ సురేశ్ రెడ్డి నిధులు
● రైల్వే బోర్డు డైరెక్టర్ బొడ్డు గంగాధర్
ఆర్మూర్: రాజ్యసభ మాజీ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 25 లక్షలు సొంత డబ్బులు ఇచ్చారని రైల్వే బోర్డు డైరెక్టర్ బొడ్డు గంగాధ ర్ వెల్లడించారు. పట్టణంలో శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేయడంతో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, ఘర్షణలు జరిగినప్పుడు పోలీసులకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. మహిళలకు రక్షణగా ఉంటుందన్నా రు. ఆర్మూర్, పెర్కిట్, మామిడిపల్లిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో పర్యటించిన రైల్వే డీఆర్‌ఎం
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ గోపాలకృష్ణన్ శుక్రవారం పర్యటించారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌కు చేరుకొని అక్కడ నుంచి మామిడిపల్లి, ఆర్మూర్ మీదుగా పెద్దపల్లికి వెళ్లారు. ఈ నెల 10న ప్రధాని నరేంద్రమోదీ మాక్లూర్ మండలం మామిడిపల్లి రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించనున్న నేపథ్యంలో పరిశీలించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా, డీఆర్‌ఎం జిల్లాలోని ఏ రైల్వేస్టేషన్‌లో కూడా ఆగకుండా నేరుగా పెద్దపల్లికి వెళ్లిపోయారు.
ప్రభుత్వ సౌకర్యాలను
సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వం కార్మికులకు అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్‌కుమా ర్ సూచించారు. శుక్రవారం మే డే (కార్మిక దినోత్సవం) సందర్భంగా కలెక్టరేట్‌లో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పిల్లల వివాహానికి కార్మిక శాఖ ద్వారా గరిష్టంగా రూ.30,000, ప్రసూతికి రూ. 30,000 అందిస్తున్నట్లు తెలిపారు. భవననిర్మాణ కార్మికులు మరణిస్తే రూ.2 లక్షల బీమా సదుపాయం ఉంటుందన్నారు. ఐటీ ఐ ప్రిన్సిపాల్ యాదగిరి, ఈఎస్‌ఐ డాక్టర్ అల్కా పటేల్, కార్మాగారాల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మికుమారి, డీసీ యాదయ్య పాల్గొన్నారు.


