త్వరలోనే జిల్లా అక్రెడిటేషన్‌ కమిటీ సమావేశం | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే జిల్లా అక్రెడిటేషన్‌ కమిటీ సమావేశం

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

నిజామాబాద్‌అర్బన్‌: కలెక్టర్‌ అధ్యక్షతన త్వరలోనే జిల్లా మీడియా అక్రెడిటేషన్‌ కమిటీ సమావేశం ని ర్వహిస్తామని అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ అన్నా రు. నిజామాబాద్‌ జిల్లా నూతన మీడియా అక్రెడిటే షన్‌ కమిటీ సభ్యులు శనివారం కిరణ్‌కుమార్‌ను మ ర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సభ్యత్వ ప త్రాలు అందజేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు అనుగుణంగా అర్హులైన వారి కి అక్రెడిటేషన్‌ కార్డులు జారీ అయ్యేలా కృషి చేయాలని సభ్యులకు సూచించారు. పారదర్శకంగా ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. డీపీఆర్‌వో పద్మశ్రీ, డీఎంఏసీ సభ్యులు నర్సింలు, భూపతి, సాయి ప్రసాద్‌, జాన్సన్‌, మాజిద్‌, రాందయానంద్‌, గౌస్‌, బాల్‌ కుమార్‌, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement