న్యూస్‌రీల్
ఫస్టియర్‌లో 56.64 శాతం ఉత్తీర్ణత.. 25వ స్థానం
సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
– 8లో u
సెకండియర్‌లో
66.19 శాతం ఉత్తీర్ణత.. 29వ స్థానం
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికల హవా మళ్లీ కొనసాగింది. ఫలితాలు ఆదివారం విడుదల కాగా, ఫస్టియర్(జనరల్)లో 56.64 శాతం, సెకండియర్‌లో 66.19 శాతం, ఒకేషనల్ ఫస్టియర్‌లో 49.65 శాతం, సెకండియర్‌లో 67.68 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు డీఐఈవో తిరుమలపూడి రవికుమార్ వెల్లడించారు. ఇంటర్ సెకండియర్‌లో 9,187 మంది, ఫస్టియర్‌లో 8,806 మంది, ఒకేషనల్ ఫస్టియర్‌లో 1,272, సెకండియర్‌లో 1,587 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయి సెకండియర్ ఫలితాల్లో జిల్లా 29వ స్థానం, ఫస్టియర్‌లో 25వ స్థానంలో నిలిచిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 7.98 శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. 2024–25 సెకండియర్‌లో 58.21 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 66.19 శాతం పాసయ్యారు. ఫస్టియర్ 2024–25లో 53.37 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 56.64 శాతం మంది పాసయ్యారు. – ఖలీల్‌వాడి
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన
విద్యార్థినులు
జిల్లా విద్యార్థులకు
రాష్ట్రస్థాయి ర్యాంకులు
గతేడాది కన్నా 7.98 శాతం
పెరిగిన ఉత్తీర్ణత
మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఈ నెల 20 వరకు ఫీజు
చెల్లింపునకు గడువు


