ఎస్‌ఎస్‌ఆర్‌ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌ఆర్‌ విద్యార్థుల ప్రతిభ

Apr 13 2026 8:20 AM | Updated on Apr 13 2026 8:20 AM

అబ్దుల్‌ నబీర్‌

960(ఎంఎల్‌టీ)

ఆర్బియానాజ్‌

954(ఎంఎల్‌టీ)

జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఇంటర్‌ ఫలితాలలో ఉత్తమ ఫలితాలను సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్‌ మారయ్యగౌడ్‌ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందించారు. నాన్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలో రాష్ట్ర, జిల్లా స్థాయి మార్కులను సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఒకేషనల్‌ విభాగంలో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌ ఎంఎల్‌టీ కోర్సులో అబ్దుల్‌ నబీర్‌ 960/1000, ఆర్బియా నాజ్‌ 954/1000 సాధించారని తెలిపారు. జనరల్‌ విభాగం ద్వితీయ సంవత్సరంలో కుందేన అఖిల్‌ 869/1000 (ఎంపీసీ), వోడేపు విష్ణు ప్రియ 857/1000 (ఎంపీసీ), ప్రథమ సంవత్సరంలో సాహితి 423/440 (బైపీసీ), షీజ కౌసర్‌ 422/470(ఎంపీసీ), ఒకేషనల్‌ విభాగం ఫస్టియర్‌లో కాలూరి ప్రణీత్‌ కుమార్‌ 474/500 (ఎంఎల్‌టీ), గోరకంటి మమత 443/500 (ఎంపీహెచ్‌డబ్ల్యూ) సాధించారన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ ఎం.హర్షిత్‌ గౌడ్‌, ప్రిన్సిపాల్‌ డా క్టర్‌ ఎన్‌. రవీందర్‌ గౌడ్‌, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement