ఎస్‌ఆర్‌ ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ ప్రభంజనం

Apr 13 2026 8:20 AM | Updated on Apr 13 2026 8:20 AM

ఎస్‌ఆర్‌ విద్యా సంస్థల విద్యార్థులు ఇంటర్‌ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మరోసారి సత్తా చాటినట్లు డీజీఎం గోవర్థన్‌ రెడ్డి ఆదివారం తెలిపారు. గంగాస్థాన్‌లోని ఎస్‌ఆర్‌ కాలేజీలో ప్రతిభచాటిన విద్యార్థులను సన్మానించారు. ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీలో ఎస్‌. చందన, ఆస్మిత్‌ గౌడ్‌, సరియన్‌ స్పందన, అఖిలేశ్‌ 470 గాను 468 సాధించి జిల్లా టాపర్స్‌గా నిలిచినట్లు తెలిపారు. 205 మంది విద్యార్థులు 467 నుంచి 460 మార్కులు సాధించారని పేర్కొన్నారు. బైపీసీలో ఆసియా అంజుమా, మనుశ్రీ, అనూష, స్నే హ 440 మార్కులకు 438 మార్కులు సాధించా రు. 78 మంది విద్యార్థులు 437 నుంచి 430 మా ర్కులు సాధించినట్లు చెప్పారు. సీఈసీలో హనీ యాసిద్దిమ్‌ 500 మార్కులకు 482 మార్కులు, శ్రీ చందన 481 మార్కులు సాధించారన్నారు. ఇంటర్‌ సెకండియర్‌ ఎంపీసీలో నడ్కుడ దినేశ్‌ 995/1000 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. మరో 27 మంది విద్యార్థులు 993 నుంచి 990 వరకు మార్కులు సాధించారు. బైపీసీలో ఉపాజఫీన్‌, హన్మిత, తిరుమల 991/1000 మార్కులతో ప్రతిభ కనబర్చారు. ఏడుగురు విద్యార్థులు 990/1000 మార్కులు సాధించారు. సీఈసీలో సంకీర్తన 967/1000 సాధించగా, ఎంఈసీలో జడల దీపికకు 955/1000 మార్కులు వచ్చాయి. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌ ఎనగందుల, వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌ రెడ్డి, సంతోష్‌ రెడ్డి, సీఈవో సురేందర్‌ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో అకాడమీ డీన్‌ రాంబాబు, జోనల్‌ ఇంచార్జి శ్రీకాంత్‌, ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement