ఎస్సెస్సీ సీజీఎల్‌లో ఆల్‌ ఇండియా 102వ ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

ఎస్సెస్సీ సీజీఎల్‌లో ఆల్‌ ఇండియా 102వ ర్యాంకు

Apr 13 2026 8:20 AM | Updated on Apr 13 2026 8:20 AM

ఖలీల్‌వాడి/ సుభాష్‌నగర్‌ : జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎస్సెస్సీ (స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌) సీజీఎల్‌(కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌)లో విద్యుత్‌ సంస్థ ఉద్యోగి శంక్‌రావు కుమారుడు ప్రణయ్‌ సత్తాచాటి ఆల్‌ ఇండియా 102వ ర్యాంకు సాధించాడు. ప్రణయ్‌ కస్టమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌న్‌ (ఎగ్జామినర్‌) ఉద్యోగానికి ఎంపికయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లలితపురం గ్రామానికి చెందిన జక్కుల శంకర్‌ నిజామాబాద్‌లో ట్రాన్‌న్స్‌ కో విజిలెన్స్‌ సీఐగా పని చేస్తున్నారు. గతంలో కూడా ప్రణయ్‌ ఎస్సెస్సీలో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగంతోపాటు వివిధ బ్యాంకుల్లో మొత్తం ఆరు ఉద్యోగాలు సాధించారు.

తెయూ విద్యార్థినికి

అరుదైన అవకాశం

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివ ర్సిటీ ఇంగ్లిష్‌ విభా గం ఫస్టియర్‌ విద్యార్థి ని కే.కీర్తనకు అరుదైన అవకాశం లభించింది. పార్లమెంటరీ రీసె ర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టి ట్యూట్‌ ఫర్‌ డెమోక్రసీ (పీఆర్‌ఐడీఈ) ఆధ్వర్యంలో 2022 నుంచి నిర్వహిస్తున్న ‘నో యువర్‌ లీడర్‌’ కార్యక్రమంలో ఈ నెల 14న కీర్తన పాల్గొననున్నారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ లో భాగంగా పార్లమెంట్‌లో రా జ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన గు రించి కీర్తన ప్రసంగించనున్నారు. రాష్ట్రం నుంచి కీర్తన ఒక్కరే ఎంపిక కావడం తెలంగాణ యూనివర్సిటీకి గర్వకారణమని తె యూ వీసీ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ ఎం యాదగిరి, ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ కే.అపర్ణ, అధ్యాపకులు అభినందించారు.

ఖరీఫ్‌కు సాగు

నీరందించాలి

వర్ని: సిద్దాపూర్‌ రిజర్వాయర్‌ ద్వారా ఖరీఫ్‌ పంటలకు సాగునీరందించాలని వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వర్ని మండలం సిద్ధాపూర్‌ శివారులో కొనసాగుతున్న రిజర్వాయ ర్‌ పనులను పోచారం ఆదివారం పరిశీలించారు. రైతులు దగ్గరుండి పనులను పర్యవేక్షించాలని, అప్పుడే నాణ్యతగా పనులు జరుగుతాయని సూచించారు. రిజర్వాయర్‌ పనులు పూర్తయితే 9 గ్రామాల రైతులకు చెందిన పదివేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. ఆయనవెంట వర్ని మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు సురేశ్‌బాబా, జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి వెలగపూడి గోపాల్‌, సిద్ధాపూర్‌ సర్పంచ్‌ బాల్‌సింగ్‌, జాకోరా సర్పంచ్‌ సాయిలు, నాయకులు గిరి, బారి పాల్గొన్నారు.

ఐఎంఏ అధ్యక్షుడికి కీలక బాధ్యతలు

సుభాష్‌నగర్‌: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ డాక్టర్‌ విశాల్‌ ఆకులకు అడిక్షన్‌ మెడిసిన్‌ స్పెషాలిటీ సెక్షన్‌ చైర్మన్‌గా జాతీయస్థాయి బాధ్యతలను అప్పగించినట్లు ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ (ఐపీఎస్‌) అధ్యక్షుడు డాక్టర్‌ టి సత్యనారాయణ, ప్రధానకార్యదర్శి డాక్టర్‌ అరుణ్‌ మార్వాలే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మానసిక వైద్యంలో, ముఖ్యంగా వ్యసన సంబంధిత రుగ్మతల చికిత్సలో ఆయనకు ఉన్న విశేష అనుభవం, నైపుణ్యం, సేవలను గుర్తిస్తూ ఈ బాధ్యతను అప్పగించినట్లు విశాల్‌ ఆకుల పేర్కొన్నారు. ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీలోని అడిక్షన్‌ మెడిసిన్‌ స్పెషాలిటీ సెక్షన్‌ దేశవ్యాప్తంగా వ్యసన వ్యాధులపై అవగాహన పెంపొందించడం, చికిత్స మార్గదర్శకాలు రూపొందించడం, పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఏప్రిల్‌ 18న రాజస్తాన్‌లోని జైపూర్‌లో నిర్వహించనున్న నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశానికి డాక్టర్‌ విశాల్‌ను ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement