సామాజిక విప్లవకారుల స్ఫూర్తిని కొనసాగిద్దాం | - | Sakshi
Sakshi News home page

సామాజిక విప్లవకారుల స్ఫూర్తిని కొనసాగిద్దాం

Apr 13 2026 8:20 AM | Updated on Apr 13 2026 8:20 AM

సుభాష్‌నగర్‌: డాక్టర్‌ అన్నాభావు సాఠే విగ్రహం మనకు నిరంతరం పోరాట పటిమను గుర్తు చేస్తుందని, సామాజిక విప్లవకారుల స్ఫూర్తిని కొనసాగిద్దామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అ డ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. నగరంలోని చంద్రశేఖర్‌ కాలనీ చౌరస్తాలో డాక్టర్‌ అన్నాభావు సాఠే విగ్రహాన్ని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మ హేశ్‌కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‌, నగర మేయర్‌ కూరగాయల ఉమారాణితో కలిసి మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అడ్లూరి లక్ష్మణ్‌ మాట్లాడుతూ దళిత సమాజం ఆర్థికంగా, రాజకీ యంగా ఎదిగినప్పుడే నిజమైన సామాజిక మార్పు సాధ్యమని, మాదిగ సామాజికవర్గం నుంచి గెలుపొందిన సర్పంచులు, కౌన్సిలర్లు తమ ప్రాంత అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ బహుజన పక్షపాతిగానే ఉంటుందని, సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలను ప్రతి ష్టించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. బలహీన వర్గాల సాధికారత కోసమే కులగణన వంటి కీలక నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని మాదిగ సామాజికవర్గానికి చెందిన సర్పంచులు, వార్డుసభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. కా ర్యక్రమంలో కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నాందేడ్‌ ఎంపీ రవీంద్ర వసంత్‌రావుచౌహాన్‌, అన్నాభావు సాఠే మనవ డు సచిన్‌ భావుసాఠే, నాయకులు పిడమర్తి రవి, జి ల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేశ్‌రెడ్డి, కార్పొరేషన్‌ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్‌ కేశ వేణు, ఎస్సీ, ఎస్టీ కోర్టు పీపీ దయాకర్‌గౌడ్‌, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలి త, మాజీ మేయర్‌ ఆకుల సుజాత, స్థానిక కార్పొరేటర్‌ పూజితాప్రవీణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి

అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

కాంగ్రెస్‌ ఎప్పుడూ బహుజన పక్షపాతి

ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు

మహేశ్‌కుమార్‌ గౌడ్‌

జిల్లా కేంద్రంలో డాక్టర్‌

అన్నాభావు సాఠే విగ్రహావిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement