మాణిక్‌బండార్‌లో ఒకరిపై దాడి! | - | Sakshi
Sakshi News home page

మాణిక్‌బండార్‌లో ఒకరిపై దాడి!

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

మాణిక్‌బండార్‌లో ఒకరిపై దాడి!

మాక్లూర్‌: మండలంలోని మాణిక్‌బండార్‌ గ్రామంలో ఓ వ్యక్తిపై సోషల్‌ మీడియా రిపోర్టర్లుగా చెప్పుకునే ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. వెంటనే స్థానికులు గమనించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారిపై సైతం నిందితులు తిరగబడినట్లు తెలిసింది. గ్రామంలో సోషల్‌ మీడియా రిపోర్టర్లుగా చెప్పుకునే ఇద్దరు వ్యక్తులు పలు అక్రమాలకు పా ల్పడుతున్నట్లు సమాచారం. వారి అరాచకాలను గ్రామానికి చెందిన బిల్లా దత్తు అనే వ్యక్తి ఎదురించాడు. దీంతో నిందితులు సోమవారం రాత్రి అతడి ని బైక్‌తో ఢీకొట్టి, దాడి చేశారు. స్థానిక యువకులు గొడవను మాన్పించే ప్రయత్నం చేయగా వారిపై కూడ నిందితులు తిరగబడినట్టు తెలిసింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాధితులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement