ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్‌లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతిచెందాడు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. గోవింద్‌పేట్ గ్రామానికి చెందిన ఆకుల ప్రవీణ్(33) ఈనెల 5న గ్రామంలోని హనుమాన్ గుడి వెనకాల గల కుంట వద్ద బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. కాగ ఈనెల 6న రాత్రి శవమై తెలాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్ మృతిపై ఎటువంటి అనుమానం లేదని తండ్రి మల్లేషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.


