● ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ రాష్ట్ర చైర్మన్
డాక్టర్ కవితారెడ్డి
● నగరంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ
సుభాష్‌నగర్: రాష్ట్రంలో పేదల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కవితారెడ్డి అన్నారు. నగరంలోని దుబ్బ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో రాజశ్రీతో కలిసి ఆమె జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కవితారెడ్డి మాట్లాడుతూ.. ఆశా ర్యకర్తలు ప్రతి గర్భిణికి పోషకాహారం, ఇతర ఆరోగ్య సమస్యలను వివరిస్తూ రక్తహీనతకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం డీఎంహెచ్‌వో కార్యాలయంలో అవగాహనాసదస్సు నిర్వహించారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ మా ట్లాడుతూ.. వ్యాధి నిర్ధారక టీకాలు, పోషకాహారం తీసుకోవడంతోపాటు మాతా శిశుమరణాలను త గ్గించడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం, జీవనశైలిలో మార్పులు తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, మహిళలు మూఢనమ్మకాలకు పోకుండా శాసీ్త్రయ దృక్ఫథంతో ఆలోచించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో అశ్వినీ, అధికారులు, సిబ్బంది వెంకన్న, శ్వేత, వెంకటేష్, రాజేశ్వర్, ఘన్‌పూర్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, వినయ్, సందీప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


